రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ASR: కొయ్యూరు మండలంలోని నడింపాలెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. అంకంపాలెం గ్రామానికి చెందిన తూబెరి ఏసుబాబు(28)అనే యువకుడు బైక్‌పై పెదవలస నుంచి వస్తుండగా, నడింపాలెం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏసుబాబు కుడికాలు విరిగిపోయిందన్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.