ఇనుపాములలో శివపార్వతుల ఉపనయన వేడుకలు
నల్గొండ: కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల ఉపనయన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులు సంప్రదాయంగా 7 కుండలు, పుట్టబంగారం, గొర్రె ఎరువులను తీసుకువచ్చి శివపార్వతులకు సమర్పించారు. అనంతరం పుట్టబంగారాన్ని ఘనంగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అందజేశారు.