VIDEO: విద్యార్థులకు అస్వస్థత.. జరిగిందిదే..!
GDL: గద్వాలలోని ST హాస్టల్లో ఉప్మా తిన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా మంగళవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని వార్డెన్ పవన్ కుమార్ తెలిపారు. ఉప్మాలో చీమలు, పురుగులు ఉన్నాయని విద్యార్థులు చెప్పడంతో వెంటనే దానిని ఆపి, వారికి బిస్కెట్లు, అరటి పండ్లు ఇచ్చినట్లు వివరించారు.