పిల్లల ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు

పిల్లల ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు

PDPL: రామగుండంలోని తబితా పిల్లల ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండగను పురస్కరించుకుని గురువారం ఆశ్రమ చిన్నారులకు సామాజిక కార్యకర్త మద్దెల దినేశ్ చొరవతో పతంగులు పంపిణీ చేయడంతో పాటు పిండివంటలు, మిఠాయిలను అందజేశారు. దీంతో పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు.