చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

NTR: విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈనెల 19న చిన్నారి షన్విత దేవిని అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మంగళవారం ఉదయం పాప చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ట్రీట్‌మెంట్ సరిగా చేయకపోవడంతోనే పాప చనిపోయిందంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.