ఢిల్లీ మద్యం కేసు విచారణ వాయిదా
ఢిల్లీ మద్యం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ సూర్యకాంత శర్మ తప్పుకోవాలని మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకరి తర్వాత మరొకరు పిటిషన్లు వేస్తున్నందున ఇంకా ఎంత మంది ఈ విషయం కోరుతున్నారని సూర్యకాంత పిటిషనర్లను ప్రశ్నించారు. అందరి పిటిషన్లపై ఒకేసారి విచారణ జరుపుతామంటూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్లు జడ్జి తెలిపారు.