వే బ్రిడ్జి సీజ్.. ధాన్యం తూకంలో భారీ మోసం

వే బ్రిడ్జి సీజ్.. ధాన్యం తూకంలో భారీ మోసం

SRPT: గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురంలో ధాన్యం తూకంలో మోసం వెలుగుచూసింది. 'శ్రీ వెంకటేశ్వర వే బ్రిడ్జి' వద్ద తూకాల్లో తేడాలు వస్తున్నాయని రైతులు ఫిర్యాదు చేయడంతో, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ​ఒక ట్రాక్టర్ లోడులో 90 యూనిట్ల వ్యత్యాసాన్ని గుర్తించిన తూనికల శాఖ అధికారులు, సదరు వే బ్రిడ్జిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.