డిపోల ఎదుట RTC కార్మికుల మహాధర్నా
TG: విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగినట్లు TGSRTC JAC ప్రకటించడం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద మహాధర్నా చేపట్టారు. RTCని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేవరకూ సమ్మె కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. నిన్న HYDలో తిరిగిన ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.