కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి..!

HYD: జిల్లా ప్రజలకు పౌరసరఫరాల శాఖ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సభ్యుల మార్పులు చేర్పుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆలస్యం చేయొద్దని DSO శ్రీనివాసరెడ్డి సూచించారు. దరఖాస్తులను పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని, ఈ ప్రక్రియను ఇటీవలే చాలా వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.