పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత: చిన్నారెడ్డి

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత: చిన్నారెడ్డి

వనపర్తి: రాష్ట్ర ప్రజా ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి డిగ్రీ కాలేజ్‌లో పరిశుభ్రత కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ ఆవరణలో చెత్తను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని చెత్తను చెత్త కుండీలో వేసి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.