VIDEO: ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి
HNK: ఎల్కతుర్తి మండలం సూరారంలో గురువారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది కూలీలు భయాందోళనకు గురయ్యారు. దాడిలో గాయపడిన నలుగురిని స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగతా కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. పని జరుగుతున్న ప్రాంతంలో ఉన్న చెట్టులోని తేనెగూడు కదలడంతో తేనెటీగలు దాడిచేశాయి.