ఈ నెల 23న వెళ్లే రైలు సర్వీసు రద్దు

ఈ నెల 23న వెళ్లే రైలు సర్వీసు రద్దు

SDPT: సిద్దిపేట-సికింద్రాబాద్ మార్గంలో ఈ నెల 23 ఆదివారం రోజున రైలు సేవలకు అంతరాయం కలగనుందని రైల్వే అధికారులు తెలిపారు. మేడ్చల్లో రైల్వే సంబంధ పనుల కారణంగా ఆదివారం ఉదయం 6.45 గంటలకు వెళ్లే సర్వీసు రద్దు కానుందని, మధ్యాహ్నం 2.20 గంటలకు యథావిధిగా బయల్దేరుతుంది అని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.