VIDEO: ఆకతాయిలతో ఇంటర్ విద్యార్థినుల అవస్థలు
అన్నమయ్య: కలికిరి పట్టణంలోని నల్లారి అమరనాథ్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆకతాయిలు విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో, కళాశాల ముఖద్వారం వద్ద బైక్‌లతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ, శబ్దాలు చేస్తూ భయాందోళన కలిగిస్తున్నారు. విద్యార్థులను దింపడానికి వస్తున్న తల్లిదండ్రులు కూడా ఈ ప్రవర్తనతో ఆవేదన చెందుతున్నారు.