VIDEO: తిరుమలలో భారీగా ఆక్టోపస్ బలగాలు

TPT: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. టీటీడీ హై అలెర్ట్ ప్రకటించడంతో ఆక్టోపస్ బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వాహనాలను, భక్తులు తిరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, పాక్ చర్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సిబ్బంది సూచించారు.