శంషాబాద్‌లో సాంకేతిక లోపంతో విమానాలు రద్దు

శంషాబాద్‌లో సాంకేతిక లోపంతో విమానాలు రద్దు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సాంకేతిక లోపం కారణంగా ఈ విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. జైపూర్, ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ధృవీకరించారు. దీనితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.