'రొయ్య రైతులు ఆందోళన చెందవద్దు'
SKLM: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుండి అధికారులతో మంత్రి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు.