ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
VSP: గ్రామీణ మండలం చినగదిలిలో ఉన్న ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గోదాములను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు.