అనకాపల్లిలో జాబ్ మేళా

అనకాపల్లి పట్టణం గవరపాలెం ఏడీ స్కూల్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయ్యే జాబ్ మేళాలో 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.