బంకర్ బస్టర్లతో ఇస్ఫహాన్‌పై అమెరికా దాడి
ఇరాన్‌లోని అణుకేంద్రాలు ఉన్న కీలక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడికి దిగింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ దాడికి సంబంధించి వీడియోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. అయితే అందులో ఎలాంటి వివరాలు లేవు. వరుసగా బాంబు పేలుళ్లు జరిగినట్లు వీడియోలో ఉంది.