VIDEO: 'శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగేలా కార్యాచరణ సిద్ధం'

VIDEO: 'శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగేలా కార్యాచరణ సిద్ధం'

ఖమ్మం జిల్లాలో 99 రోజుల కార్యచరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే మండల, గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.