HYD సైబర్ క్రైమ్ చేతికి రూ.2.43 కోట్ల నిందితుడు

HYD సైబర్ క్రైమ్ చేతికి రూ.2.43 కోట్ల నిందితుడు

HYD: నగర సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టుబడి మోసం కేసులో మహారాష్ట్రకు చెందిన గుర్జోత్ సింగ్‌ను గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16 కేసులు, తెలంగాణలో 2 కేసుల్లో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. HYDలో ఓ బాధితుడిని పెట్టుబడి పేరుతో నమ్మించి రూ.2.43 కోట్లు మోసగించాడు. మొదట లాభాలు చూపించి, తర్వాత ఉపసంహరణ నిలిపివేశాడని పోలీసులు తెలిపారు.