ముగిసిన భవానీ దీక్షల విరమణ
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. ఈ 5 రోజుల్లోనే దుర్గమ్మను 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భవానీలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.