వీధి కుక్కలకు ముమ్మరంగా వ్యాక్సినేషన్లు: కమిషనర్
CTR: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలకు ABC, ARV వ్యాక్సిన్లు వేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణలో భాగంగా జంతు ప్రేమికులకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం నిషేధమని, ఆహార అందించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.