బిజ్వార్‌లో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

బిజ్వార్‌లో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్‌లో జరగనున్న దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆదివారం ఆదిత్య పర శ్రీ భక్తులతో కలిసి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 21 నుంచి దుర్గాభవాని మాలల ప్రారంభం ఉంటుందని, ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని పేర్కొన్నారు.