VIDEO: అంకాలగూడెం గ్రామం జలమయం

VIDEO: అంకాలగూడెం గ్రామం జలమయం

ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొయ్యలగూడెం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నూతికుంట కాలువ ఉప్పొంగడంతో అంకాలగూడెం గ్రామం జలమయమైంది. ఈ కాలువ పూడికతీత చేపట్టాలని గ్రామస్థులు గత సంవత్సరం నుంచి కోరుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని వాపోతున్నారు.