'రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాలు పనిచేయాలి'
VZM: రాజకీయాలకు అతీతంగా సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలందించాలని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ గుర్ల మండలం కెల్ల PACSను సందర్శించి సంఘం గోదాములు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సేవలో సంఘాలు పనిచేయాలని సూచించారు. ఆయనతో పాటు సంఘం అధ్యక్షురాలు విమల రాణి, నాయకులు గోవింద్ ఉన్నారు.