సీఎం సభకు తరలి వెళ్లిన మేడారం కార్యకర్తలు

సీఎం సభకు తరలి వెళ్లిన మేడారం కార్యకర్తలు

PDPL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే కాటారం బహిరంగ సభకు ధర్మారం మండలం మేడారం కార్యకర్తలు తరలి వెళ్లారు. సర్పంచ్ వీర్పాల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో బస్సులలో బయలుదేరారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని స్థానిక నాయకులు తెలిపారు.