స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NTR: నందిగామ నెహ్రూనగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భక్తులకు అభివాదం చేసి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.