VIDEO: రోడ్లపై యథేచ్చగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు
NLG: చిట్యాల పరిధిలో నెంబర్ ప్లేట్లు లేని బైక్‌లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాహనాలపై నెంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం ఉండాలని ఉన్నా, అసలు ప్లేట్లే లేని వాహనాలు రోడ్లపై కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాలతో నేరాలకు పాల్పడినప్పుడు నిందితులను గుర్తించడం పోలీసులకు తలనొప్పి కానుంది. ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.