'వైద్య సేవలు నిమిత్తం త్వరలో ప్రత్యేక బస్సులు'

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్య సేవలు అందించేందుకు త్వరలో మూడు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అత్యవసర వైద్యం నిమిత్తం కాకినాడ లేదా రాజమహేంద్రవరం పేసెంట్లను తరలించేందుకు ఈ బస్సులను వినియోగిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వైద్యం నిమిత్తం మరో బస్సును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.