VIDEO: మేడారం జాతర ఏర్పాట్లు డ్రోన్ కళ్లలో కనువిందు
MLG: మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని చేపట్టిన అభివృద్ధి పనులు డ్రోన్ వీడియోల్లో శనివారం కనువిందు చేస్తున్నాయి. జంపన్న వాగు, గ్రామ రహదారులు, ఆలయ గద్దెలు, పరిసర ప్రాంతాలు సుందరంగా కనిపిస్తున్నాయి. జాతరకు ఇంకా 18 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటికే లక్షలాది భక్తులు ముందుగానే మేడారానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.