VIDEO: మంత్రికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం
NDL: సీఎం చంద్రబాబు దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం 'ఇంద్ర ధనస్సు' పేరుతో ప్రత్యేక పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షుడు రమణయ్య మంత్రి ఫరూక్‌ను కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాలు రాష్ట్రంలోని ప్రజలకు వినియోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.