రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని వినతి
RR: కోళ్ల పడకల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సాయి మహాలక్ష్మి రైస్ మిల్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, విషవాయువుల కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పంట పొలాల్లో పంటలు నాశనమయ్యే అవకాశం ఉందని, రాబోయే రోజులలో త్రాగునీరు కూడా కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ చేపంగి ప్రవీణ్‌కు గ్రామస్తులు వినతి పత్రం అందచేశారు.