పిడుగురాళ్లలో గృహాల పట్టాలు పంపిణీ
GNTR: పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. PMAY పథకాల ద్వారా నిర్మించిన ఈ గృహాలలో, గురజాల నియోజకవర్గంలో మొత్తం 2,832 గృహాలు మంజూరు కాగా, సోమవారం 1,296 గృహాల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.