'రోడ్డు పై చెత్త నిల్వలు.. మంత్రి ఆగ్రహం'

SKLM: టెక్కలి పాతజాతీయ రహదారిపై చెత్తనిల్వలు పేరుకుపోవడంపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం అసహనం వ్యక్తం చేశారు. రావివలస గ్రామ పర్యటనకు వచ్చిన ఆయన టెక్కలి పాతజాతీయ రహదారిపై చెత్త నిల్వలతో అపారిశుద్ధ్యం నెలకొనడంపై పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త నిల్వలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.