రాధాకృష్ణన్ సెక్రటరీగా అమిత్ ఖరే

రాధాకృష్ణన్ సెక్రటరీగా అమిత్ ఖరే

నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు. ఈ మేరకు శిక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖరే నియమానికి కేబినెట్ అపాయింట్ కమిటీ ఆమోదించినట్లు పేర్కొంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు విధుల్లో ఉండనున్నారు. జార్ఖండ్ కేడర్ అయిన ఖరే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక కీలక పదవుల్లో పని చేశారు.