నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం
VSP: మాజీ CM జగన్ నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఉ. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో అరకు వెళ్తారు. MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. మ. విశాఖలోని మర్రిపాలెం మాజీ MLA వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారని స్థానిక నాయకులు వెల్లడించారు.