కడప జిల్లాలో 81 మంది MPEOలు బదిలీ

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పస్పర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్(MPEO)లను గురువారం బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరికొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజనుకు బదిలీ చేశారు.