రంజాన్ తొలి ఇఫ్తార్ విందు
VZM: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం బాబామెట్ట హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ ధర్మకర్త డా. ఖలీల్ బాబు ఆధ్వర్యంలో తొలి ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ప్రేమ, త్యాగం, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక, మానవత్వానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ పర్వదినాలను నేటి నుంచి 30 రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారన్నారు.