జాతీయ స్థాయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అమలాపురం విద్యార్ది
కోనసీమ: అమలాపురంకి చెందిన 8వ తరగతి విద్యార్ధి గోసంగి సందీప్ అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి పోటీలలో స్వర్ణ పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన సందీప్ జాతీయ స్థాయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సందీప్‌ను పలువురు అభినందించారు.