18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం

AP: ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలరాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18న శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7:59 గంటలకు ఈ మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.