దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

చిత్తూరు: గుడిపల్లి మండలం పొగరుపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో బైక్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సుమారు రూ. 3.5 లక్షల విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు.