ఘనంగా మల్లన్న నాగవెల్లి పట్నాలు
KNR: పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి గ్రామంలో వెలసిన నల్లగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గ్రామ కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్వామివారికి నాగవెల్లి పట్నాలు అత్యంత ఘనంగా వేశారు. రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దిన పట్నాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు.