పంట కాలవలో మహిళ మృతదేహం కలకలం
NTR: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామ శివారు దేచుపాలెం వెళ్లే రోడ్డులోని పంట కాలువలో ఆదివారం తెల్లవారుజామున స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పంట పొలాలకు వెళుతుండగా కాలువలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి జగ్గయ్యపేట మార్చురీకి తరలించారు.