తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

SRPT:  తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన జాజిరెడ్డిగూడెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. జాజిరెడ్డి గూడెంకి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.