VIDEO: పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: నందివాడ మండలంలోని అత్కూరు యూటీ మీడియం డ్రైన్‌లో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. రూ.40 లక్షల నిధులతో చేపట్టిన పూడికతీత పనులను పెద లింగాల గ్రామం వద్ద ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. డ్రైనేజీలో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నందివాడ మండలంలోని అత్యధిక గ్రామాల్లో వరద ముంపు గురికావని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.