మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ
ప్రకాశం: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎవరైనా కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు వచ్చిన వెంటనే వారి ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి, ప్రత్యేక బృందాలతో ఆచూకీ కనుగొనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో వెంటనే స్పందించాలన్నారు.