ఈ నెల 23, 24న ఫుట్ బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు
TPT: శాప్‌లీగ్ పోటీల్లో భాగంగా తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో ఫుట్ బాల్, బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఫుట్ బాల్ పోటీలకు అండర్-15 బాలబాలికలు, 24న బాక్సింగ్ పోటీలకు అండర్-15, 19 బాలికలు మాత్రమే అర్హులన్నారు. వివరాలకు ఈ నెంబర్ 8919295921, 9849159147లను సంప్రదించాలన్నారు.