ఎన్నికలు.. మహిళలకు నెలకు రూ.1700
అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరాల జల్లు కురిపించారు. లక్ష్మీ భండార్ పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1700 ఇస్తామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే బెంగాల ప్రజలంతా ఏకధాటిగా ఉండి బీజేపీని ఓడించాలని కోరారు.