'ఇలా వేశారు.. అలా కొట్టుకుపోయింది'

'ఇలా వేశారు.. అలా కొట్టుకుపోయింది'

ADB: బిడ్జిపై అప్రోచ్ మరమ్మతులకు వేసిన మట్టి 2 రోజులకే కొట్టుకుపోతోంది. భీంపూర్ మండలంలోని గుబిడి, టెక్షి రాంపూర్ వెళ్లే రోడ్డు మార్గంలో వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు భారీ వర్షాలకు కోతకు గురైంది. ఎమ్మెల్యే ఆదేశాలతో స్థానిక నాయకులు రాకపోకలకు అంతరాయం లేకుండా నాణ్యత లేని మట్టి వేశారు. కానీ అది మళ్లీ కొట్టుకుపోవడంతో నామమాత్రపు పనులు చేశారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.